దేశీ ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ పైకి కదిలాయి. 6 పైసలు, 16 పైసలు చొప్పున పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర రూ.79.53కు చేరింది. డీజిల్ ధర రూ.73.37కు ఎగసింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 7 పైసలు పెరుగుదలతో రూ.79.10కు చేరింది. డీజిల్ ధర కూడా 16 పైసలు పెరుగుదలతో రూ.72.62కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 6 పైసలు పెరుగుదలతో రూ.78.73కు చేరింది. డీజిల్ ధర 16 పైసలు పెరుగుదలతో రూ.72.28కు ఎగసింది. Also Read: దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 6 పైసలు పెరుగుదలతో రూ.74.74కు చేరింది. డీజిల్ ధర 15 పైసలు పెరుగుదలతో రూ.67.24కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 6 పైసలు పెరుగుదలతో రూ.80.40కు చేరింది. డీజిల్ ధర 16 పైసలు పెరుగుదలతో రూ.70.55కు ఎగసింది. Also Read: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.18 శాతం పెరుగుదలతో 66.88 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.19 శాతం పెరుగుదలతో 61.80 డాలర్లకు ఎగసింది. Also Read: ఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు. Also Read:
https://ift.tt/39dGngI
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2EY5Ble
No comments:
Post a Comment