దేశీ ఇంధన ధరలు పెరిగాయి. 17 పైసలు, 19 పైసలు చొప్పున పైకి కదిలాయి. దీంతో హైదరాబాద్‌లో సోమవారం లీటరు పెట్రోల్ ధర రూ.79.85కు చేరింది. డీజిల్ ధర రూ.73.96కు ఎగసింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 16 పైసలు పెరుగుదలతో రూ.79.40కు చేరింది. డీజిల్ ధర 18 పైసలు పెరుగుదలతో రూ.73.18కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 17 పైసలు పెరుగుదలతో రూ.79.04కు చేరింది. డీజిల్ ధర 18 పైసలు పెరుగుదలతో రూ.72.84కు ఎగసింది. Also Read: దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 16 పైసలు పెరుగుదలతో రూ.75.04కు చేరింది. డీజిల్ ధర 18 పైసలు పెరుగుదలతో రూ.67.78కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 16 పైసలు పెరుగుదలతో రూ.80.69కు చేరింది. డీజిల్ ధర 19 పైసలు పెరుగుదలతో రూ.71.12కు ఎగసింది. Also Read: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.15 శాతం పెరుగుదలతో 66.97 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.02 శాతం పెరుగుదలతో 61.73 డాలర్లకు ఎగసింది. Also Read: ఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు. Also Read:
https://ift.tt/2SACP27
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/368h0Lv
No comments:
Post a Comment