గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం ధర.. వెండి ఢమాల్! - "Current Bits of knowledge Center"

"Current Bits of knowledge Center"

Welcome to the "Current Bits of knowledge Center," your go-to objective for remaining educated and motivated. Jump into the most recent news, provocative examinations, and convincing stories from around the globe. Our group of prepared writers and givers present to you a different scope of themes, covering all that from making it known and inside and out highlights to social patterns and mechanical developments. Investigate the world from our perspective and join the discussion on the issues tha

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 14 March 2020

గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం ధర.. వెండి ఢమాల్!

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. పసిడి వెలవెలబోతోంది. మూడు రోజులుగా తగ్గుతూనే ఉంది. భారీగా పడిపోతూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసడి ధర తగ్గడం, రూపాయి రికవరీ సహా దేశీ మార్కెట్‌లోనూ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో పసిడిపై ప్రతికూల ప్రభావం పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇకపోతే బంగారం ధర తగ్గితే కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో గత మూడు రోజుల్లో బంగారం ధర భారీగా దిగొచ్చింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.2,100కు పైగా పతనమైంది. దీంతో ధర రూ.43,850కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా దాదాపు రూ.2,000 పడిపోయింది. దీంతో ధర రూ.40,200కు పతనమైంది. Also Read: పసిడి ధర పడిపోతే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర గత మూడు రోజుల కాలంలో రూ.470 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.48,030కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం పడిపోయింది. 1530 డాలర్ల కిందకు వచ్చేసింది. పసిడి ధర ఔన్స్‌కు 3.85 శాతం తగ్గుదలతో 1529.10 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 8.20 శాతం తగ్గుదలతో 14.69 డాలర్లకు పడిపోయింది. Also Read: దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర దిగొచ్చింది. గత 3 రోజుల కాలంలో బంగారం ధర రూ.1,850 పతనమైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,050కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.42,250కు పడిపోయింది. ఇక వెండి ధర రూ.470 తగ్గుదలతో రూ.48,030కు దిగొచ్చింది. ఇకపోతే పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

https://ift.tt/2xwlf6X
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/33nBEGH

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages