కరోనా వైరస్ భారత్‌లో శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 300 దాటింది. దీంతో కేంద్ర సర్కార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎక్కడ ఈ వైరస్ అంతటా వ్యాపిస్తుందోనని పటిష్టమైన చర్యలు చేపట్టింది. మరోవైపు వైరస్ భయంతో ప్రజలు ఎవరు బయటకు రావడం లేదు. మరోవైపు కొందరు ఖైదీలు కూడా కోరనాపై ఆందోళన వ్యక్తం చేస్తూ జైలుకు నిప్పు పెట్టారు. ఈఘటన పశ్చిమబెంగాల్‌లోని కోల్ కతాలోని డమ్ డమ్ సెంట్రల్ జైల్లో చోటు చేసుకుంది. ఖైదీలు తమను బయటికి పంపించాలని జైలు సిబ్బందిని కోరారు. లేకపోతే కరోనాకు బలయ్యే ప్రమాదం ఉందని వారు అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఖైదీలు జైలు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆవేశానికి లోనయైన ఖైదీలు జైలుకు నిప్పంటించారు. పదేళ్లకు పైగా జైల్లో గడిపి సత్ప్రవర్తన చూపిన ఖైదీలకు కరోనా కారణంగా 15 రోజుల స్పెషల్ పెరోల్ ఇవ్వాలని జైలు అధికారులు నిర్ణయించడం కొందరు ఖైదీలకు రుచించలేదు. దీంతో ఆ ఖైదీలే జైలుకు నిప్పుపెట్టారని తెలుస్తోంది. జైల్లో మంటలు చెలరేగడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందకి సమాచారం అందించారు. జైలు వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు.ఈ ఘటనలో కొందరు జైలు అధికారులపై ఖైదీలు దాడికి దిగినట్టు సమాచారం. ఖైదీలను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. మరోవైపు కరోనా వైరస్ ధాటికి ఒక్క రోజులోనే ఇటలీలో 793 మంది మృతిచెందారు. శనివారం ఒక్కరోజే 6,557 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఆదివారం దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చింది.
from National news in Telugu: Latest India news in Telugu | India News Headlines in Telugu - Telugu Samayam https://ift.tt/3adI11S
No comments:
Post a Comment