బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి శుభవార్త. వరుసగా రెండో రోజు కూడా తగ్గింది. దీంతో ఇప్పుడు బంగారం కొనాలనుకునే వారికి ఇది కొంత ఊరట కలిగించే విషయమనే చెప్పొచ్చు. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెలవెలబోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధర తగ్గడంతోపాటు దేశీ మార్కెట్‌లో జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో పసిడిపై ప్రతికూల ప్రభావం పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.100 తగ్గుదలతో రూ.45,800కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ.100 క్షీణతతో రూ.41,980కు తగ్గింది. Also Read: పసిడి ధర బాటలోనే కూడా నడిచింది. వెండి ధర ఎక్కువగానే పడిపోయింది. కేజీ వెండి ధర రూ.450 మేర పతనమైంది. దీంతో కేజీ వెండి ధర రూ.49,500కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం దిగొచ్చింది. 1700 డాలర్ల కిందకు వచ్చేసింది. పసిడి ధర ఔన్స్‌కు 0.02 శాతం తగ్గుదలతో 1673.25 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 2.33 శాతం క్షీణతతో 16.85 డాలర్లకు తగ్గింది. Also Read: దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర తగ్గింది. రూ.110 మేర దిగొచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.42,850కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 క్షీణతతో రూ.44,050కు తగ్గింది. ఇక వెండి ధర కూడా రూ.450 తగ్గుదలతో రూ.49,500కు క్షీణించింది. Also Read: ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
https://ift.tt/3aFgu9y
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/39CF1vZ
No comments:
Post a Comment