బంగారం మెరిసిపోతోంది. పసిడి ర్యాలీ చేస్తోంది. పరుగులు పెడుతూనే వస్తోంది. ఈరోజు కూడా ఇదే ట్రెండ్ నడిచింది. పసిడి మళ్లీ పైపైకి కదిలింది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా ఆరో రోజు కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గినా కూడా మన మార్కెట్‌లోనూ పసిడి ధర పైకి కదలడం గమనార్హం. మరోవైపు బంగారం ధర బాటలోనే కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.1150 పెరుగుదలతో రూ.45,650కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1010 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.41,850కు ఎగసింది. Also Read: పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.610 పైకి కదిలింది. దీంతో వెండి ధర రూ.41,910కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పైకి కదలడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 0.99 శాతం తగ్గింది. దీంతో బంగారం ధర 1760 డాలర్ల కిందకు పడిపోయింది. ఔన్స్‌కు 1751.20 డాలర్ల వద్ద కదలాడుతోంది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలోనే నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 1.01 శాతం తగ్గుదలతో 15.97 డాలర్లకు క్షీణించింది Also Read: దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.420 పెరుగుదలతో రూ.43,540కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.680 పెరుగుదలతో రూ.45,800కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.610 పెరిగింది. దీంతో ధర రూ.41,910కు చేరింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
https://ift.tt/3cuO6YP
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/3ckhQY9
No comments:
Post a Comment