బంగారం వెలవెలబోతోంది. పసిడి ధర తగ్గుతూనే ఉంది. మూడు రోజులుగా నేలచూపులు చూస్తూనే ఉండటం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గడంతో మన దేశంలోనూ పసిడి ధరపై ప్రతికూల పడిందని చెప్పుకోవచ్చు. మరోవైపు బంగారం ధర తగ్గితే మాత్రం భారీగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 తగ్గుదలతో రూ.44,120కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.90 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.40,430కు పడిపోయింది. Also Read: పసిడి ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1540 పైకి కదిలింది. దీంతో వెండి ధర రూ.42,700కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.42 శాతం దిగొచ్చింది. దీంతో ఔన్స్‌కు 1704.30 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 1.23 శాతం తగ్గుదలతో 15.42 డాలర్లకు క్షీణించింది. Also Read: దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90 తగ్గుదలతో రూ.41,900కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.90 తగ్గుదలతో రూ.44,470కు పడిపోయింది. ఇక కేజీ వెండి ధర ఏకంగా రూ.1540 పెరిగింది. దీంతో ధర రూ.42,700కు చేరింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
https://ift.tt/2yrkBbA
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2Ki4orK
No comments:
Post a Comment