గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం ధర.. వెండి ఢమాల్! - "Current Bits of knowledge Center"

"Current Bits of knowledge Center"

Welcome to the "Current Bits of knowledge Center," your go-to objective for remaining educated and motivated. Jump into the most recent news, provocative examinations, and convincing stories from around the globe. Our group of prepared writers and givers present to you a different scope of themes, covering all that from making it known and inside and out highlights to social patterns and mechanical developments. Investigate the world from our perspective and join the discussion on the issues tha

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 18 April 2020

గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం ధర.. వెండి ఢమాల్!

బంగారం ర్యాలీకి అడ్డుకట్ట పడింది. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన పసిడి ధర ఈ రోజు పడిపోయింది. ఒక్క రోజులోనే భారీగా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుదల సహా రూపాయి రికవరీ బాట పట్టడం వల్ల పసిడి వెలవెలబోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు బంగారం ధర తగ్గితే కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.1680 తగ్గుదలతో రూ.44,290కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1500 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.40,600కు పడిపోయింది. Also Read: పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.690 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.41,200కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 2.14 శాతం దిగొచ్చింది. 1700 డాలర్ల కిందకు పడిపోయింది. దీంతో ఔన్స్‌కు 1694.60 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 1.75 శాతం తగ్గుదలతో 15.34 డాలర్లకు క్షీణించింది. Also Read: దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1940 తగ్గుదలతో రూ.41,920కు దిగొచ్చింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1460 తగ్గుదలతో రూ.44,640కు పడిపోయింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.690 తగ్గింది. దీంతో ధర రూ.41,200కు క్షీణించింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

https://ift.tt/2KqV70N
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/3aiahjh

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages