పసిడి ప్రియులకు శుభవార్త. తగ్గింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర ఇప్పుడు తగ్గుతూ వచ్చింది. బంగారం ధర తగ్గడం వరుసగా మూడు రోజులుగా పడిపోతూనే వచ్చింది. బంగారం కొనుగోలు చేయలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది శుభవార్త అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి ధర దిగిరావడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. గత మూడు రోజుల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1050 క్షీణించింది. దీంతో ధర రూ.44,870కు తగ్గింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా క్షీణించింది. 10 గ్రాముల బంగారం ధర రూ.960 తగ్గుదలతో రూ.48,680కు దిగివచ్చింది. Also Read: పసిడి ధర తగ్గితే.. మాత్రం పైకి కదిలింది. కేజీ వెండి ధర పెరిగింది. రూ.590 పైకి చేరింది. దీంతో వెండి ధర రూ.48,250కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.74 శాతం పైకి కదిలింది. దీంతో ధర ఔన్స్‌కు 1734.70 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 1.88 శాతం పెరుగుదలతో 17.69 డాలర్లకు ఎగసింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
https://ift.tt/3geYkPr
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2TwaYje
No comments:
Post a Comment