పసిడి పరుగులు పెట్టింది. మళ్లీ పెరిగింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి ధర పైకి కదలడం గమనార్హం. బంగారం ధర పెరిగితే కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పైకి చేరింది. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 పెరిగింది. దీంతో ధర రూ.51,320కు ఎగసింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.180 పెరుగుదలతో రూ.47,030కు చేరింది. Also Read: పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.600 పెరిగింది. దీంతో ధర రూ.52,900కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.05 శాతం క్షీణించింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1809 డాలర్లకు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.23 శాతం తగ్గుదలతో 19.71 డాలర్లకు దిగొచ్చింది. Also Read: దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పైకి కదిలింది. రూ.47,900కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.200 పెరుగుదలతో రూ.49,100కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.90 పెరుగుదలతో. రూ.52,900కు చేరింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
https://ift.tt/30q6bCF
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3eM3ArX
No comments:
Post a Comment