భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరింది. గత మార్చి నుంచి దేశంలో క్రికెట్ సిరీస్‌లన్నీ రద్దవగా.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనల్ని సడలించడంతో స్టేడియాలు తెరుస్తున్నారు. కానీ.. తాజాగా కోల్‌కతాలోని స్టేడియం సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో.. బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) హెడ్‌క్వార్టర్స్‌ని ఏడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు క్యాబ్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా ప్రకటించాడు. ‘‘కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి.. సివిల్ ఇంజినీర్‌గా తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. గత వారం రోజుల నుంచి అతను విధులకి రాలేదు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో గత శనివారం కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం అతను చార్నాక్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. వారం నుంచి అతను ఆఫీస్‌కి రాకపోయినా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్యాబ్ ఆఫీస్‌ని కూడా 7 రోజులు మూసివేసి.. శానిటైజ్ చేయాలని నిర్ణయించాం’’ అని అవిషేక్ దాల్మియా తెలిపాడు. భారత్‌లో ఆదివారం నాటికి కరోనా వైరస్ కేసుల సంఖ్య 6,97,836కి చేరుకోగా.. ఇందులో 19,700 మంది ఇప్పటికే చనిపోయారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో ఈ కేసులు 22,126 ఉండగా.. ఒక్క కోల్‌కతాలోనే 6,864 నమోదయ్యాయి.
from క్రికెట్ వార్తలు: Latest India Cricket News, Today Match Score, Highlights | Samayam Telugu https://ift.tt/3gxgfR0
No comments:
Post a Comment