మహేంద్రసింగ్ ధోనీ పుట్టిన రోజు సందర్భంగా అతని భార్య సాక్షి చెప్పిన విషెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగళవారం 39వ పడిలోకి అడుగుపెట్టిన ధోనీకి భారత క్రికెటర్లతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున విషెస్ చెప్పారు. ఈ క్రమంలో అతని భార్య సాక్షి కూడా సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్తూ.. ధోనీ మరింత స్వీట్‌గా తయారయ్యాడంటూ కితాబిచ్చింది. అంతేకాకుండా తియ్యనైన మాటలకి, గిప్ట్స్‌కి పడిపోయే నైజం నీది కాదంటూ తన భర్త గురించి చెప్పకనే చెప్పింది. ‘‘ధోనీ నీకు ఇంకో ఏడాది వయసు పెరిగింది.. సూచికగా జుట్టు కూడా ఇంకొంచెం తెల్లబడింది. కానీ.. చాలా స్మార్ట్, స్టీట్‌గా తయారయ్యావు (నిజంగా). ఇలాంటి తియ్యనైన మాటలు, గిప్ట్స్‌కి నువ్వు పడిపోవు. కేట్ కట్ చేసి, కొవ్వొత్తులని వెలిగించడం ద్వారా మరో ఏడాది పుట్టిన రోజు వేడుకలు జరుపుకుందాం..! హ్యాపీ బర్త్ డే శ్రీవారు..!!’ అని విషెస్ చెప్పింది. సాక్షి చెప్పింది అక్షరాల సత్యం. ధోనీ ఎవరి విషెస్‌కి ఇప్పటి వరకూ స్పందించలేదు.. స్పందించడు కూడా. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? ధోనీ సాధ్యమైనంత వరకూ ఎవరికి బర్త్ డే విషెస్ కూడా చెప్పడు. మొదటి నుంచి ధోనీ అంతే..! ధోనీ బయోపిక్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుంటే దేశంలోని వివిధ రంగాలకి చెందిన సెలబ్రెటీలు అందరూ స్పందించారు. కానీ.. ధోనీ మాత్రం కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. వాస్తవానికి ధోనీ బయోపిక్ షూటింగ్‌కి ముందు కొన్ని రోజులపాటు ధోనీతో కలిసి సుశాంత్ ట్రావెల్ చేశాడు. దాంతో.. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కనిపించింది. కానీ.. అతను సూసైడ్ చేసుకుంటే ధోనీ కనీసం రెస్పాండ్ అవలేదు. అంతేకాదు తన రిటైర్మెంట్‌పై సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్, విమర్శలపై కూడా ధోనీ స్పందించడు.
from క్రికెట్ వార్తలు: Latest India Cricket News, Today Match Score, Highlights | Samayam Telugu https://ift.tt/3gDk9aY
No comments:
Post a Comment