పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి తీపికబురు. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్లిన క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈరోజు కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి దిగొచ్చిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక పసిడి పడిపోతే వెండి మాత్రం పరుగులు పెట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర మరోసారి దిగొచ్చింది. మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.340 పడిపోయింది. దీంతో ధర రూ.55,320కు తగ్గింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ.310 తగ్గుదలతో రూ.50,700కు క్షీణించింది. Also Read: పసిడి ధర పడిపోతే.. మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.900 పైకి కదిలింది. దీంతో ధర రూ.68,900 చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.30 శాతం క్షీణించింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1992 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.32 శాతం తగ్గుదలతో 27.58 డాలర్లకు క్షీణించింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
https://ift.tt/3g1KTkx
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3g1KMFD
No comments:
Post a Comment