విజయవాడ నగర శివారులో తుపాకీ కాల్పుల కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి అగంతకులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందాడు. యువకుడిపై దుండగులు కాల్పుల జరిపి కాల్చి చంపారు. అయితే మృతుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే మహేష్‌గా గుర్తించారు. కాల్పుల ఘటన విజయవాడ శివారు బైపాస్‌రోడ్డులోని బార్ సమీపంలో చోటుచేసుకుంది. నిందితులు పథకం ప్రకారమే మహేష్‌ను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. Read More: సీపీ బత్తిన శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని అర్ధరాత్రి పరిశీలించారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరంలో చోటు చేసకున్న ఈ ఘటనతో విజయవాడ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.
https://ift.tt/3jOx0c5
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/30PDct2
No comments:
Post a Comment