దేశీ ఇంధన ధరలు మరోసారి నిలకడగానే కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈరోజు కూడా ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే ఉన్నాయి. దీంతో హైదరాబాద్లో గురువారం లీటరు పెట్రోల్ ధర రూ.84.25 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.76.84 వద్ద నిలకడగా కొనసాగుతోంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర రూ.87.16 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.79.34 వద్ద నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.86.73 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.78.93 వద్ద నిలకడగా కొనసాగుతోంది. Also Read: దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర స్థిరంగానే ఉంది. రూ.81.06 వద్ద నిలకడగా కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.70.46 వద్ద స్థిరంగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.87.74 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.76.86 వద్ద నిలకడగా కొనసాగుతోంది. Also Read: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు చెరోదారిలో నడిచాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.02 శాతం తగ్గుదలతో 43.37 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.05 శాతం పెరుగుదలతో 41.08 డాలర్లకు చేరింది. ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.
https://ift.tt/351V310
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/378mxoI
No comments:
Post a Comment