తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క (శిరీష) అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో బర్రెలు కాస్తున్న ఫ్రెండ్స్ అంటూ ట్రెండ్ అయిన శిరీష ఈసారి ఎన్నికల్లో నిలబడిన విషం విధితమే. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని.. దాని కారణంగానే తాను బర్రెలను కొనుక్కొని వాటిని కాయడానికి వెళ్తున్నానని ఓ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది శీరీష. ఆ వీడియోకు కొన్ని లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అప్పటి వరకు ఎవరికీ తన పేరు తెలియని వాళ్లకు బర్రెలక్కగా పేరు తెచ్చుకుంది. శిరీష అంటే ఎవరో తెలియకపోయినా.. బర్రెలక్కగా మాత్రం బాగా పాపులర్ అయ్యారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయగా.. వాటిలో ఏదో ఒక ఉద్యోగం సాధించాలనే కసితో హైదరాబద్ వచ్చి.. కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యారు శిరీష. కానీ.. పేపర్స్ లీక్ అవ్వడం.. కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలను వాయిదా వేయండా.. గ్రూప్ 1 అయితే రెండు సార్లు నిర్వహించిన నేపథ్యంలో శిరీషతో పాటు.. ఎంతో మంది నిరుద్యోగులు కలత చెందారు.


No comments:
Post a Comment