నిర్భయ ఘటనను ఈ దేశం ఎప్పటికీ మరిచిపోలేదు. ఆరోజు అర్థరాత్రి దేశ రాజధానిలో జరిగిన ఘోరాన్ని ఇప్పటికే గుర్తు చేసుకుంటూ... ఒళ్లు గగుర్పొడుస్తుంది. 2012, డిసెంబర్ 16 - అర్థరాత్రి 12 గంటలు దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో ఓ మెడికల్ చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థిని అతని స్నేహితుడితో కలిసి బస్సు ఎక్కింది. ఆ బస్సులోనే యువతిపై పాశవిక చర్యకు పాల్పడ్డారు కామాంధులు. నిర్భయపై మానవమృగాల లైంగిక దాడికి తెగబడ్డారు. ఏకంగా ఆరుగురు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అత్యంత పాశివికంగా నరరూప రాక్షసులు, యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. చలి రాత్రిలో, కదులుతున్న బస్సులో నుంచి ఆమెను నగ్నంగా బయటకు విసిరేసిన ఘోరమది. ఆమెతో పాటు అతడి స్నేహితుడిపై కూడా దాడి చేసి రోడ్డుపై పడేశారు. దీంతో వారిని గుర్తించిన పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. నిర్బయ పరిస్థితిని చూసి డాక్టర్లు సైతం చలించిపోయారు. ఆమె పేగులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆమె అంతర్గత అవయవాలపై క్రూరంగా దాడి చేశారు. జననాంగంలో పదే పదే ఇనుపచువ్వలు పెట్టడంతో బాధితురాలి పేగు మొత్తం ఛిద్రమైంది. దీంతో నిర్భయను మెరుగైన చికిత్స కోసం సింగపూర్ కూడా తరలించారు. అక్కడ కూడా ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. డిసెంబర్ 29న గ్యాంగ్‌రేప్ బాధిత విద్యార్థిని మృతిచెందింది. రాక్షసులతో పోరాడి పోరాడి మగువల తెగువేంటో నిరూపించింది. దేశ రాజధానిలో జరిగిన ఇంతటి ఘోరాతి ఘోర ఘటన ప్రపంచాన్ని మెలిపెట్టి పిండేసింది. దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. నిర్భయ దోషులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళనలు నిర్వహించారు. ఆ నాటి ఘటన ఇంకా కళ్లముందే తిరుగుతూ ఉంది. దేశమంతా ఆమెకు జరిగిన అన్యాయంపై గళమెత్తింది. నిందితులకు శిక్షపడాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం వెంటనే నిర్భయ చట్టాన్ని తెచ్చింది. నిందితులకు ఉరి శిక్షను ఖరారు చేసింది. అయితే ఈ కేసులో మొత్తం ఆరుగురిలో ఒకరు మైనర్ బాలుడు ఉన్నాడు. ప్రధాన నిందితుడు రామ్‌సింగ్ కేసు విచారణ జరుగుతుండగానే 2013 మార్చి 11న తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కోర్టు నలుగురు నిందితులకు ఉరి శిక్ష విధించింది. మిగిలిన మైనర్ బాలుడికి మూడేళ్ల శిక్ష విధించడంతో అది పూర్తి అయిపోయింది. కానీ ఏడేళ్లు గడిచినా నిందితులకు శిక్ష మాత్రం పడలేదు. షాద్‌నగర్‌లో దిశపై జరిగిన అత్యాచార ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్‌తో నిర్భయ నిందితుల ఉరి మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో కేసు విచారణను వేగవంతం చేసిన న్యాయస్థానం నిందితులకు మార్చి 20వేది ఉదయం 5:30గంటలకు ఉరి తీయాలని తీర్పు ఇచ్చింది. జరిగిన 8 ఏళ్ల తర్వాత దోషులకు శుక్రవారం ఉరిశిక్ష అమలు చేశారు.
from National news in Telugu: Latest India news in Telugu | India News Headlines in Telugu - Telugu Samayam https://ift.tt/33wSP8L
No comments:
Post a Comment