నిర్భయ దోషులు నలుగురికి ఉరిశిక్ష అమలు అయ్యింది. ఉదయం నాలుగు గంటలకే నలుగురికి జైలు అధికారులు అల్పాహారం అందించారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. జైలు నెంబర్ 3లో నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలు చేశారు. నలుగురిని ఒకే సమయంలో ఉరి తీశారు. ఒక్కొక్క దోషి 12 మంది సిబ్బంది ఉన్నారు. ఉరికంబం వద్ద 48 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఉరిశిక్షకు ముందు వినయ్ శర్మ బోరున విలపించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు నిర్భయ దోషులకు ఉరి తీయడంతో తీహర్ జైలు బయట సంబరాలు చేసుకున్నారు. సౌత్ ఢిల్లీలో 2012 డిసెంబర్ 12న కదులుతున్న బస్సులో మెడికల్ స్టూడెంట్ నిర్భయను గ్యాంగ్ రేప్ చేశారు. నిర్భయను తీవ్రంగా గాయపరిచారు. కొన్ని రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన నిర్భయ.. చివరికి ప్రాణం వదిలింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మొత్తం ఆరుగురు దోషులు కాగా.. ఒకడు జైల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు మైనర్ కావడంతో జువైనల్ జైల్లో శిక్ష అనుభవించాడు. 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు తీహార్ జైల్లో నలుగురు దోషులకు తీశారు. దోషులు పవన్, ముఖేష్, అక్షయ్, వినయ్ శర్మలకు ఉరిశిక్షలను అమలు చేశారు.
from National news in Telugu: Latest India news in Telugu | India News Headlines in Telugu - Telugu Samayam https://ift.tt/2U2mT9o
No comments:
Post a Comment